నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకన్న సుమన్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ఏటా ప్రకటించే లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈ ఏడాది  సుమన్ దక్షిణాది నుంచి  ఎంపికయ్యాడు.
కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వస్తున్నారు.
కాగా ముంబయిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డును సుమన్ కి ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు.