‘పంజాబ్’ ఘన విజయం!

ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6),సూర్యకుమార్‌ యాదవ్‌(33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో షమి, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా దీపక్‌ హుడా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం పంజాబ్ జట్టు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(60 నాటౌట్‌; 52 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకంతో మెరవగా,మయాంక్‌ అగర్వాల్‌(25; 20 బంతుల్లో 4×4, 1×6) క్రిస్‌గేల్‌(43 నాటౌట్‌; 35 బంతుల్లో 5×4, 2×6)ఫర్వాలేదనిపించారు. దీంతో పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేయగా.. డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది.