కోల్కతా పై రాయల్స్ విజయం!

వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ పడింది. శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో పోరులో రాయల్స్ జట్టు సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. జట్టులో ప్రధాన బ్యాట్సమెన్స్ స్వల్ప స్కార్స్కి ఔటైనా.. రాహుల్‌ త్రిపాఠి(36; 26 బంతుల్లో 1×4, 2×6) దినేశ్‌ కార్తీక్‌(25; 24 బంతుల్లో 4×4)రాణించడంతో నైట్ రైడర్స్ అమాత్రమైన స్కోర్ చేయగలింగింది. రాజస్థాన్‌ బౌలర్లలో క్రిస్‌మోరిస్‌ నాలుగు, ఉనద్కత్‌, సకారియా, ముస్తాఫిజుర్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోల్కతా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌(42*), డేవిడ్‌ మిల్లర్‌(24*) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి రెండు, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ తలా ఓ వికెట్‌ తీశారు.