శంషాబాద్ జౌటర్ పై కారుబోల్తా.. టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు పై  కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ జిల్లా టీఆర్ ఎస్ సీనియర్ నేత రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. పొోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇంతటి దు:ఖ శోొకంలోనూ కుటుంబ సభ్యులు దినేష్ కండ్లను దానం చేశారు.

( చిత్రంలో మల్లిఖార్జున్ రెడ్డిని పరామర్శిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి)

మరోవైపు దినేష్ మరణవార్తతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. అతని మరణ వార్త విన్న వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. మల్లిఖార్జున్ రెడ్డిని కలిసి పరామర్శించారు. దినేష్ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.