Newsminute24

నూతనంగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎస్

దేశంలో నూతనంగా మరో ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విద్యాభారతి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఓజాతీయ పత్రికతో ఈ విషయాన్ని అధికారికంగా ధృవికరీంచారు.విద్యారంగంలో సానుకూల మార్పులే లక్ష్యంగా విద్యాలయాల ఏర్పాటు జరగబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ.. అసోంలోని గౌహతిమ యూనివర్శిటీకి సంబంధించిన పనులను ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందని స్పష్టం చేశారు. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు చేరారని.. సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తున్నామన్నారు. విద్యాసంస్థలన్ని కులాల మతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన 29,000 స్కూళ్లలో ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని యతీంద్ర శర్మ చెప్పుకొచ్చారు.

కాగా విద్యాభారతి ఇటీవల కేంద్రప్రారంభించిన జాతీయ విద్యావిధానం గురించి అవగాహాన కల్పించడానికి ప్రచారాన్ని చేపట్టింది. ఈకార్యక్రమ లక్ష్యం భారత కేంద్రీకృత విద్య అంశాలను ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడంతో పాటు.. 6వ తరగతి నుంచి ప్రతిభావంతమైన నైపుణ్య విద్యతో  డిగ్నిటీ ఆఫ్ లేబర్ని  ప్రేరేపిస్తూ.. NEP ఆధారంగా ‘మాతృభాష’ను ప్రోత్సహించడమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఈప్రచారం కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేశారు.

 

Exit mobile version