Site icon Newsminute24

దీపావళి ఎప్పుడు..? పండుగ జరుపుకోవడంపై అయోమయం..!

Sambasiva Rao: 

దీపావళి పండుగ  విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. హిందువులు అందరు దీవాలిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు, ఈ పండగ రోజు సాయంత్రం  ప్రజలు తమ ఇంటిముందు దీపాలు వెలిగించి బాణాసంచ కలుస్తారు.  హిందూ పురాణాల్లో దీపావళి వెనక 2కథలు పాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగములో  శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని అనే రాక్షసుడి  సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. 

అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఈ వెలుగుల పండగ జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. ప్రతి సంవత్సరం దీపావళిని ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు జరుపుకుంటారు. 

ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత గందరగోళం నెలకొంది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే… ప్రభుత్వం దీపావళి సెలవును నవంబర్‌ 25న ప్రకటించింది. దీంతో కొంత మంది  ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు. దీంతో కాస్తా అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే  పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్‌ 24వ తేదీన దీపావళి జరుపుకోవాలని చూసిస్తున్నారు . 

అక్టోబర్‌ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సా. 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్‌ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి వస్తుంది.  అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. కాబట్టి 24వ తేదీ రాత్రి దీపావళి జరుపుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు.

 

Exit mobile version