Site icon Newsminute24

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడినట్లయిందని షా అన్నారు. కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని షా తేల్చి చెప్పారు.

Exit mobile version