టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదున్నాడు యువ నటుడు సంతోష్ శోభన్. అతను తాజాగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. అలా మొదలైంది ఫేం నందినిరెడ్డి దర్శకురాలు. మాళవిక నాయర్ కథనాయిక. ఎవడే సుబ్రహ్మణ్యం, మహనటి, సీతారామం వంటి చిత్రాల తర్వాత స్వప్న సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. సరైన హిట్ కోసం వేచిచూస్తున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాడా? స్వప్న సంస్థ ఖాతాలో మరో హిట్ మూవీ చేరినట్టేనా? తెలియాలంటే సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం!
కథ ….
విక్టోరియాపురం ఊరిలోని ఎస్టేట్ లో తయారయ్యే కాఫీ పోడికి ఓప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈఎస్టేట్ గురించి ప్రసాద్(రాజేంద్రప్రసాద్) దివాకర్ (రావు రమేష్) కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కోర్టు కేసు నడుస్తుంటుంది. దివాకర్ తమ్ముడు సుధాకర్(సీనియర్ నరేష్) కొడుకు రిషీ( సంతోష్).. ప్రసాద్ కూతురు ఆర్య(మాళవిక నాయర్) ఒకే రోజు ఆస్పత్రిలో జన్మిస్తారు. అయితే ఆస్పత్రిలోని నర్సింగ్ స్టాఫ్ మిస్ అండర్ స్టాడింగ్ వలన పిల్లలు మారిపోతారు. దాంతో ప్రసాద్ కొడుకుగా రిషీ, సుధాకర్ కూతురుగా ఆర్య పెరిగి పెద్దవాళ్లవుతారు. చదువు అనంతరం ఇద్దరు కాఫీ బిజినెస్ పనిమీద యూరప్ వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఇంతకు తల్లిదండ్రులకు పిల్లలు మారిన విషయం తెలిసిందా? కోర్టు కేసు ఏమైంది? రిషీ – ఆర్య మధ్య పరిచయం ప్రేమగా మారిందా? తెలియాలంటే వెండితెరపై సినిమా చూసి తీరాల్సిందే..!
ఎలా ఉందంటే..?
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం ఆహ్లదభరితంగా సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఆస్పత్రిలో పిల్లలు మారిన సీన్స్ చూస్తుంటే అలవైకుంఠ పురం సినిమాలోని సీన్స్ గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. రెండు కుటుంబాలకు సంబంధించిన కాఫీ ఎస్టేట్ కేసులో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఉన్నంతలో కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. సెకాండాఫ్ వచ్చేసరికి .. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. మిగతా సీన్స్ రోటిన్ గా అనిపిస్తాయి. తండ్రి వ్యక్తిత్వం అమ్మాయికి వచ్చినట్లు.. తల్లి వ్యక్తిత్వం కొడుకు వచ్చినట్లు అంతర్గీనంగా చెప్పాలనుకున్న పాయింట్ మెచ్చుకోదగినదనే చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా సంతోష్ శోభన్ రిషీ పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్ సీన్స్ లో పరిణితి చెందిన నటన ప్రదర్శించాడు. హీరోయిన్ మాళవిక ఆర్య పాత్రలో జీవించేసింది. తనదైన నటన,అందంతో ఆకట్టుకుంది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ , గౌతమి, మిగతా నటీనటులు పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక పనితీరు..
చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి చెప్పాలనుకున్న కథను తెరపై ప్రజెంట్ చేయడంలో కొంతమేర విజయం సాధించారు. ఆమె ఎంచుకున్న పాయింట్ అద్భుతమనే చెప్పొచ్చు. మిక్కీ జె మేయర్ సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. నిర్మాణ విలువులు బాగున్నాయి.
” చివరగా ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే ‘అన్నీ మంచి శకునములే”
రివ్యూ రేటింగ్: 3/5
( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)