Newsminute24

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి !

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం స్నాహి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమె పేరును ఖరారు చేశారు. ప్రస్తుత గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31 న ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక జరిగింది. గతంలో నీలం స్నాహి ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన స్నాహి.. ఉమ్మడి రాష్ట్రంలో పలు పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

Exit mobile version