సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అభిప్రాయపడ్డారు.
కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ భాజపా బహిరంగసభలో ఆరోపించారు. టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి వాటిని తిరస్కరించి బీజేపీలో చేరారని.. ఆయన్ని గెలిపించుకోవల్సిన బాధ్యత అందరీ మీద ఉందన్నారు.
చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తిలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అసలు రాంకీ సంస్థ చెత్త నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
·మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలిచి తీరాలన్నారు సంజయ్. ఉప ఎన్నిక కేవలం మునుగోడుకు సంబంధించిన ఎన్నికలు కావని.. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసినా.. జైళ్లకు పంపినా.. పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు తరలి వచ్చి సభను విజయవంతం చేశారని సంజయ్ స్పష్టం చేశారు.