sambashiva Rao:
=============
Baladitya vs galatta Geetu: బిగ్ బాస్ సీజన్ 6 సోమవారం నాటి 58వ ఎపిసోడ్‌లో నామినేషన్ పక్రియ ముగిసింది. నామినేషన్స్ లో 10 మంది ఉన్నారు. ఇక మంగళవారం రానున్న ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా మారనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ ప్రొమోలో గీతూ.. అదిత్య మధ్య వార్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ ఇంపాజబుల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యలు రెండు గ్రూపులుగా వీడిపోవాలి. వీరిలో కొందరూ రెడ్ స్క్వాడ్ , కొందరూ బ్లూ స్క్వాడులు గా వీడిపోయి.. ఇతర బృందంలో వారి చంపి అ టాస్క్ గెలవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. వీడిపోయాన వారు కేవలం ఫిజికల్ గా కాకుండా , బుధ్దిబలం కూడా ఉపయోగించి గెలవాలని చూచిస్తాడు.
ఇక బ్లూ స్క్వాడ్ సభ్యులుగా రోహిత్, మెరీనా, వాసంతి, ఇనయ, రాజ్, ఆదిరెడ్డి, ఆదిత్య ఉంటారు. ఇక ఎర్రసైన్యంలో గీతు, రేవంత్, కీర్తి, ఫైమా, రాజ్, శ్రీసత్య, శ్రీహాన్ ఉంటారు.
గత వారం నాగార్జున గీతుకి గడ్డిపెట్టినా కూడా..ఆమెలో మార్పు రాలేదు. తన నీఛమైన ఆటతో బాలాదిత్యని ఏడిపించింది. బాలాదిత్య ఎమోషన్స్‌తో ఆడుకుని బోరు బోరున ఏడ్చేట్టు చేసింది గీతు. సిగరెట్ తాగడం బాలాదిత్య వీక్ నెస్.. గతంలో ఇదే విషయంలో గీతు ఆతనికి నరకం చూపిచింది. టాస్క్‌లో గెలవడం కోసం..ఆదిత్య లైటర్ దాచేసింది. శ్రీ సత్య, శ్రీహాన్ ఇచ్చిన పనికి మాలిన ఐడియాతో గీతు.. బాలాదిత్య లైటర్ దాచేసింది.
అతని వీక్నెస్‌పై దెబ్బకొట్టాలని ఈ ముగ్గురూ స్కెచ్ వేశారు. గీతు అయితే.. బాలాదిత్య లైటర్స్‌ని తన టీషర్ట్ లోపల దాచుకుంది. బాలాదిత్య లైటర్ అడగ్గా.. ‘ గేమ్‌లో రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తాం’ అని గీతు, శ్రీ సత్యలు అన్నారు. ఆటలో గెలవాలి ఇదేం పని అంటూ ఆదిత్య హెచ్చరించాడు. ఐనా సరే రెండు బ్లూ స్ట్రిప్స్ ఇస్తేనే లైటర్ ఇస్తానని గీతు దిగజారిపోవడం చూసి.. చాలా చీప్‌గా బిహేవ్ చేస్తున్నా్వ్ గీతూ.. అని అంటే.. అది నాకు తెలుసు.. నేను చీప్‌దాన్నే థాంక్యూ సో మచ్’ అని దిగజారిపోయింది గీతు. ఇంకో రెండు స్ట్రిప్‌లు ఇస్తే సిగరెట్ ఇస్తా గీతు మాట్లాడింది. దీంతో బాల భావోద్వేగానికి గురయ్యాడు.. ‘ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా?? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా? అని బాలాదిత్య కన్నీరు మున్నీరు అయ్యాడు.
అయితే అసలు లైటర్ ఇచ్చిన శ్రీహాన్ ఏమి తెలియనట్లు చూస్తున్నాడు. ఈ టాస్క్ లో అగ్రిసివైనా రేవంత్ వడ్డీతో చెల్లిస్తానంటూ ఇనయకి వార్నింగ్ ఇస్తాడు. ఇనయ శ్రీసత్య మీద ఫైర్ అవుతుంది. గేమ్ ఆడటం నేర్చుకోవాలంటే.. శ్రీసత్య దానికి కౌంటర్ గా నేను ఫ్రేండ్ కి వెన్నుపోటు పొడవలేదంటూ వెటరంగా మాట్లాడుతుంది.