Site icon Newsminute24

హైకోర్టు ఆదేశాలతో సంజయ్ విడుదల!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్ఎస్‌పై ధర్మ యుద్ధం చేస్తానని, కేసీఆర్‌ను జైలుకు పంపేవరకూ వదలిపెట్టనని శపథం చేశారు సంజయ్‌. కరీంనగర్ పోలీసులు సీఎంఓ డైరెక్షన్లో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో 317 విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు బండి సంజయ్.
ఇక ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ రాష్ట్ర నేతల్లో బండి సంజయ్‌ ఎపిసోడ్‌లో జాతీయ నాయకత్వం కదిలిరావడం జోష్‌ నింపింది. ఇక ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీ పోరు ఎటువంటి మలుపులు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

Exit mobile version