Site icon Newsminute24

బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారి రాజీనామా!

బిజెపి కార్యకర్తల అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు హుమాయున్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ‘ దేశ ద్రోహులను కాల్చి పారేయాలి ‘ అంటూ చేసిన వ్యాఖ్యలనుగుణంగా కబీర్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు , పలువురు ఉన్నతాధికారులు రాజీనామాల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.  కొద్దిరోజుల ముందు సువెందు అధికారి , రాజీవ్ బెనర్జీ లు వారి పదవులతో పాటు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హిందూ ఓటర్లను ఆకర్షించడానికి , హిందీ మాట్లాడే వారితో ఇటీవలే టీఎంసీ ప్రధాన కార్యాలయంలో దీదీ సమావేశమయ్యారని గవర్నర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

Exit mobile version