Newsminute24

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సుమారుగా ఐదు నుంచి ఆరువేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించారు.ఈ ధర్మ యుద్ధంలో రాజ్ గోపాల్ వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు.ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు గుణపాఠం చెబుతామని శపథం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇదే ఊపుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నేతలు తీర్మానించారు.ప్రచారంతో పాటు చేరికలపై దృష్టిసారించనున్నట్లు తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని.. రాజగోపాల్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చితీరుతుందని బీజేపీ నేతలు కుండబద్ధలు కొట్టారు.

మొత్తంమీద బీజేపీ అధినాయకత్వం తెలంగాణలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తుండటంతో ..రాష్ట్ర నాయకత్వం అలెర్ట్ అయ్యింది. ఉప ఎన్నిక ప్రచారంతో పాటు చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.అమిత్ షా..ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పడంతో .. నేతల్లో వణుకు మొదలైంది.ఇగోలను పక్కన పెట్టి పనిచేయాలన్న సూచనలను నేతలంతా తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారు.

Exit mobile version