Site icon Newsminute24

అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!

సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే  ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు లంచం తీసుకోను అంటున్నారు  సరే.. మిగతా ఉద్యోగులు తీసుకుంటున్నట్లు మీరు భావిస్తున్నారా? రెవెన్యూ ఆఫీసులో లంచం లేనిదే ఫైలు కదలదని బయట టాక్ వినిపిస్తోంది! అంటూ ప్రశ్న సంధించాడు. నాకు ఎవరితో సంబంధం లేదు..నేను మాత్రం లంచం తీసుకోను అంటూ నర్సయ్య స్పష్టం చేశాడు.

 

నర్సయ్య ప్రచారంపై సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్..

“యధా రాజా తధా ప్రజ ” అన్నట్టుగా సూర్యాపేట జిల్లాలో పరిపాలన సాగుతుందని సీనియర్ జర్నలిస్ట్ షబ్బీర్ ఆరోపించారు. జిల్లా అధికారి నుంచి మారుమూల గ్రామస్థాయి ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరు స్వార్థ పూరిత వైఖరితో పనిచేస్తున్నారని..ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

జిల్లాలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే తంతు నడుస్తున్నప్పుడు.. “నాకు లంచం వద్దు అని “నేను లంచం తీసుకోను.. అని ఒక అధికారి అనగానే అనగానే ఏదో గొప్ప పనిలా ఆకాశానికి ఎత్తేయడం సరికాదన్నారు. అతను పెద్ద మెహెర్బాని ఏమి చేయలేదని.. ఇప్పుడున్న బ్రష్టు పట్టిన వ్యవస్థలో అలాంటి మాట అందరికీ వింతలా అనిపిస్తుందని ..ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. అపార్థం చేసుకోవద్దన్నారు.

కాగా ప్రతీ ఉద్యోగి తన  జేబుకు తగిలించుకోవలసిన స్టిక్కర్ “నేను ప్రజా సేవకుడిని మీకు ఏ విధంగా సహాయ పడగలను.. మీ సమస్యను పరిష్కరించడం నా బాధ్యత ” నాతొ పని చేపించుకోవడం మీ హక్కు అని రాసుకోవాలన్నారు షబ్బీర్. ప్రతీ ఉద్యోగి చేయవలసిన పని ఇదేనని.. చెప్పాల్సిన మాట కూడా ఇదేనన్నారు. ఇలా రాసి ప్రభుత్వ కార్యాలయాల్లో  పెట్టె ధైర్యం ఏ అధికారికి కానీ ఉద్యోగి కి గాని ఉందా ? అంటూ ప్రశ్నించారు. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదని..ప్రజాసమస్యలను చూసి ఆవేదనతో స్పందిస్తున్నానని షబ్బీర్ స్పష్టం చేశారు.

Exit mobile version