Site icon Newsminute24

గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..

గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది.

 

ఇక వీడియో గమనించినట్లయితే.. గోహత్య లో ప్రమేయం ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా చంపేయలంటూ రాజస్థాన్ కు చెందిన జ్ఞాన్ దేవ్ పిలుపునిచ్చారు. తమ అనుచరులు గోఅక్రమ రవాణకు పాల్పడిన ఐదుగురిని చంపినట్లు వ్యాఖ్యానించారు. ఆయన గతంలో రామ్ గడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వీడియో వైరల్ కావడంతో..జ్ఞాన్ దేవ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A కింద మత సామరస్యాన్ని వ్యాప్తి చేసినందుకు కేసు నమోదు చేయబడింది.

మరోవైపు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు జ్ఞాన్ దేవ్ అహుజా . ఆవుల అక్రమ రవాణా, వధలో పాల్గొన్న ఎవరైనా రక్షించబడరని స్పష్టం చేశారు. అయితే గో అక్రమ రవాణకు పాల్పడిన వారిని తన అనుచరులు చంపలేదని.. కేవలం కొట్టి వదిలేశారని జ్ఞాన్ దేవ్ వివరణ ఇచ్చారు.

Exit mobile version