Sambashiva Rao:
==============
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రీక్ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. హీరో మోటోకార్ప్.. పెట్రోల్ వెహికల్స్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడా వీ1 పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ బైక్ , హీరో ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌తో విడా పోటీపడనుంది.
ఎలక్రిక్ వెహికల్ విభాగంలోనూ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన హీరో మోటోకార్ప్ ..అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్‌లో 490 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. రెండు కంపెనీలు కలిసి ఈ బైక్స్ రూపొందించాలని నిర్ణయించాయి. హీరో మోటోకార్ప్ ..విడా వీ1 రెండు వేరియంట్లలో (విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో )ఈ శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. వీ1 ప్లస్ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ కంపెనీ నిర్ణయించింది.
ఈ స్కూటర్ బుకింగ్‌లు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ రెండో వారం నుంచి ఈ బైక్స్ డెలివరీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఫీచర్స్ చూస్తే..
విడా వీ1 మోడల్ సింగిల్ ఛార్జ్‌తో 143 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది.
విడా ప్రో మోడల్ సింగిల్ ఛార్జ్‌తో 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
రిమూవబుల్ బ్యాటరీ, పోర్టబుల్ ఛార్జర్
వీ1 ప్లస్ ధరను రూ.1.45 లక్షలు
వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలు
వీడా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనే పవర్ ఛేంజ్ కానుందని ఆ సంస్థ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజాల్ పేర్కొన్నారు.