Newsminute24

ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ షాక్.. సెర్చ్ బటన్ డిసెబుల్!

iBOMMA : ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ (iBOMMA) షాకిచ్చింది. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన చివరి 30 సినిమాలను చూసేందుకు మాత్రమే వీలు కల్పిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతంలో యూజర్లు సెర్చ్ అప్షన్ లోకి వెళ్లి నచ్చిన సినిమాలు ఆన్ లైన్ లో చూడడంతో పాటు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా సెర్చ్ అప్షన్ బటన్ నూ డిసెబుల్ చేసింది. ఇది కేవలం ఇండియన్ యూజర్లకు మాత్రమేనా లేకా అన్ని దేశాల వినియోగదారులకు వర్తిస్తుందా అన్నది క్లారీటీ లేదు.

కాగా కొన్ని రోజుల క్రితం వెబ్‌సైట్‌ నిర్వహణ కష్టంగా ఉందని ఖర్చులు భారీగా పెరిగిపోయాయని.. తమపై అసత్యాలను దుష్ర్పచారం చేస్తుండడంతో వెబ్‌సైట్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించి.. యూజర్ల విజ్ణప్తి మేరకు వెనక్కి తగ్గింది. ఈనేపథ్యంలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చూడవచ్చు అంటూ ఐబొమ్మ వెబ్ సైట్ హోం పేజిలో ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఐబొమ్మ తాజా నిర్ణయంపై సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంచక్కా నచ్చిన సినిమాను ఐబొమ్మ ఫ్లాట్ ఫాంపై చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్లమని..ఇప్పడు ఆఅవకాశం మిసైందంటూ కామెంట్స్ ..మిమ్స్ తో రెచ్చిపోతున్నారు. అసలు ఐబొమ్మ యాజమాన్యం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలియాలంటూ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version