Site icon Newsminute24

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్‌ (67), స్నేహ్‌ రాణా (53 నాటౌట్‌), స్మృతి మంధాన (52) అర్ధ శతకాలతో రాణించారు.

Exit mobile version