Site icon Newsminute24

విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు.

కాగా బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్ధుల అస్వస్థతకు కారణంగా భావిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. విద్యార్ధుల్లో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందిందని సంజయ్ పేర్కొన్నారు.

ఇక ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్… దేశ రాజకీయాలు సంగతి పక్కన పెట్టీ.. గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సంజయ్ సూచించారు.

 

Exit mobile version