Site icon Newsminute24

భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?

భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.
కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది.
ఇక సౌతాఫ్రికాతో టెస్ట్ సీరీస్ ఓటమి అనంతరం పంత్​, బుమ్రా, కేఎల్​ రాహుల్​ పేర్లు వినిపించినప్పటికి .. సెలక్టర్లు రోహిత్​ వైపే మొగ్గు చూపినట్లు క్రికెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version