దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించింది.దీంతో మూడు వన్గేల సిరీస్ ను 2_1 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.తొలుత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో సఫారి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయగా.. ఛేజింగ్ లో శుభ్ మన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్ తో అదరగొట్టడంతో సిరీస్ కైవసం చేసుకుంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది.ఆజట్టులో క్లాసెన్, మలాన్, యాన్సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆదినుంచే టీంఇండియా బౌలర్లు ఎటాక్ బౌలింగ్ తో సఫారి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.తొలుత సిరాజ్ ,ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగగా.. షాజాద్, కుల్ దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో సఫారి బ్యాట్స్ మెన్స్ ను బోల్తా కొట్టించారు.
అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత జట్టు 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్(49) ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ (28), సంజు శాంసన్ (2) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.రెండో వన్డే హీరో ఇషాన్ కిషన్ (10)పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుజన్ , ఎంగిడి చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కుల్ దీప్ యాదవ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా మహ్మాద్ సిరాజ్ అవార్డులను గెలుచుకున్నారు.