Newsminute24

కంబ‌ళ వీరుడు స‌రికొత్త రికార్డు!

కంబ‌ళ వీరుడు శ్రీనివాస్ గౌడ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఆదివారం క‌ర్ణాట‌క‌లోని తాలుకా మండ‌లం క‌క్య‌ప‌డ‌వ గ్రామంలో మైరా సంస్థ నిర్వ‌హించిన పోటిలో.. వంద మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 8.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రికార్డును సృష్టించాడు. గ‌త‌వారం వెళ్తాంగ‌డి ప‌రిధిలో జ‌రిగిన కంబ‌ళ‌ పోటిలో 100 మీట‌ర్ల దూరాన్ని 8.96 సెక‌న్ల‌లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న పేరిట ఉన్న‌ రికార్డును తానే బ్రేక్ చేసిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది జ‌రిగిన‌ కంబ‌ళ పోటిలో విజేత‌గా నిలిచి గౌడ వెలుగులోకి వ‌చ్చాడు.

Exit mobile version