వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్‌లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు మెటా ప్రొడక్ట్ హెడ్ అమీ వోరా చెప్పారు.
ఇంతకుముందు ఏ యూజర్ అయినా ఆన్‌లైన్లో ఉంటే కాంటాక్ట్ గ్రూపులోని వ్యక్తులను తెలిసేది. దీంతో ఆ సమయంలో ఎవరైనా మెసేజ్ పంపితే.. దానికి స్పందించకపోతే చూసి కూడా స్పందించనట్లుగా ఉండేది. అది అవతలి వ్యక్తులతో ఉన్న సంబంధాలను బట్టి ఒక్కోసారి ఇబ్బందిగా ఉండేది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ స్టేటస్ చూపించకుండా నియంత్రించే మరో ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది మెటా.
కొత్తగా వచ్చిన మరో ఫీచర్”వ్యూ ఒన్స్”మెసేజ్ కి సంబంధించినది. ఒకసారి మెసెజ్ చూశాకా కనిపించకుండా ఉండే ఫీచర్ ను మెటా అందుబాటులోకి తెచ్చింది.ఇంతకుముందు ‘వ్యూ ఒన్స్’మెసేజ్‌లను గతంలో స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇకపై వ్యూ ఒన్స్ మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసేందుకు వీలులేకుండా ఉండే ఫీచర్ ను మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది.