Site icon Newsminute24

మాస్ వైల్డ్ లుక్ లో కళ్యాణ్ రామ్.. మ‌రోసారి హిట్ గ్యారంటీ..!!

Sambasiva Rao:

_______________

బింబిసార చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో వ‌ర‌స సినిమాల‌తో దూసుపోతున్నారు నంద‌మూరి కళ్యాణ్ రామ్. ఆయ‌న క‌థ‌నాయ‌కుడిగా నూత‌న ద‌ర్శ‌కుడు రాజేంద్ర రెడ్డి డైరెక్ష‌న్ లో సినిమా వ‌స్తోన్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది యాక్షన్ సీన్‌కు అని అర్థమైతుంది. బోల్తా పడిన వాహనం దగ్గర నుంచి గన్స్ పట్టుకుని కళ్యాణ్ రామ్ వస్తున్నారు. ఇది క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ చిత్రం.

ఈ పోస్టర్ చూసిన నంద‌మూరి అభిమానులు మ‌రో్సారి సీల్వ‌ర్ స్క్రీన్ పై క‌ళ్యాణ్ రామ్ మాస్ జాత‌ర షూరు అంటూన్నారు. గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. బింబిసార‌ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు మొద‌లైయ్యాయి.

Exit mobile version