Site icon Newsminute24

ఊరించి ఊసురుమ‌నిపిస్తుంది..ఈ సారైనా అదృష్టం వ‌రించేనా..?

Sambasiva Rao:

==============

ప్ర‌పంచ క‌ప్ వ‌స్తుందంటేచాలు అభిమానులే కాదు, పోటీలో పాల్గొనే జ‌ట్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ దృష్టిలో ఉంచుకొని ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేస్తాయి యాజ‌మాన్యాలు. అయితే వ‌న్దే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా.. ప్రపంచకప్‌లో ఆ జట్టుది ఓట‌మి బాట‌నే.. ఆ జ‌ట్టులో స్ట్రాంగ్ ప్లేయ‌ర్స్ లేక కాదు. అంద‌రూ ప్ర‌పంచ‌స్థాయి ఆట‌గాళ్లే.. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టుతో పోటీప‌డే టీం మ‌రోక‌టి లేదు. ఎంత ఉన్న ల‌క్ మాత్రం దాని వెంటలేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య బ‌రిలోకి దిగి, క‌ప్ ఖాయం అనుకుంటే.. సెమీస్ లోనే చ‌తికిల ప‌డిపోతుంది.  ప్రపంచకప్‌లో గెలవడం సంగతటుంచితే ఇప్పటిదాకా కనీసం ఫైనల్‌ కూడా చేరలేదు ఆ జట్టు. ఇలా ఒక సారి కాదు ప్ర‌తిసారి ఇదే జ‌రుగుతుంది. ఇంత‌కి ఆ జ‌ట్టు ఏదో అర్థ‌మైందా..? అదే ద‌క్షిణాఫ్రికా. 

వ‌ర‌ల్డ్ క‌ప్ ఏదైనా స‌రే సౌతాఫ్రికా ఆ జట్టు బలంగానే కనిపిస్తుంది.  ఇలా ఊరించి ఊసురమ‌నిపించ‌డం కొత్త‌మి కాదు. ప్రతిసారీ . టైటిల్‌కు పోటీదారులాగే అనిపిస్తుంది. కానీ తీరా చూస్తే.. ఏదో ఒక దశలో తడబడి ఇంటిముఖం పడుతుంది.  1998 ఏదో ఒక్కసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిందే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు సాధించేది లేదు. 1992, 99, 2007, 2015 ఇలా నాలుగు సార్లు వ‌రుస విజ‌యాల‌తో సెమిస్ చేరి ఓడ‌పోయింది. మరి ఈసారైనా ఆ జట్టు ప్రదర్శన మారుతుందేమో చూడాలి. 

 వన్డే ప్రపంచకప్‌లో ఒకప్పుడు సౌతాఫ్రికా గొప్ప జట్టున్నప్పటికీ దురదృష్టం వెంటాడుతూనే ఉంది. పోలాక్, స్మిత్, గిబ్స్, డివిలయ‌ర్స్ , మిల్ల‌ర్, మోర్క‌ల్, ఇలా ఒక‌రిద్దరు కాదు ఎంతో మంది స్టార్ ఆట‌గాళ్లున్నారు. అయితే ప్రస్తుత జట్టులో డికాక్, మార్‌క్రమ్, స్ట‌బ్స్, మిల్లర్, రబాడ, షంసి లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఉన్నారు. ఏ ఒక్క‌రు క్రీజులో ఉన్నా.. ఒంటి చేత్తో మ్యాచ్‌లు మ‌లుపుతిప్ప‌గ‌ల స‌త్తా ఉంది.  

ఈసారి ప్ర‌పంచ క‌ప్ లో  డివిలియర్స్, డుప్లెసిస్, స్టెయిన్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు దూర‌మైయ్యారు.  ఇక కొత్త ఆట‌గాళ్లు క్లాసెన్, రీజా హెండ్రిక్స్‌ కూడా ఇటీవల టీమిండియాతో సిరీస్‌లో చక్కటి ప్రదర్శన చేశారు. వీళ్లంతా ఈసారి రాణిస్తే..అదృష్టం కూడా తోడైతే గెలుపు దక్షిణాఫ్రికా పక్షాన నిల‌వ‌డం ఖాయం.  కాగితం మీద దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగం. అగ్రశ్రేణి బౌలర్లు రబాడ, షంసి, నోకియా ఇటీవల అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నారు. టీమిండియాతో జ‌రిగిన టీ20, వ‌న్దే సిరీసుల‌లో రాణించ‌లేక‌పోయారు.

సూపర్‌-12లో దక్షిణాఫ్రికా ఉన్న గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, నెద‌ర్ లాండ్స్, బంగ్లాదేశ్‌లతో పాటు మ‌రో క్వాలిఫయర్‌ జట్టుతో ఆడతుంది. భారత్, పాక్‌ జట్లలో ఒకదాన్ని ఓడిస్తే సెమీస్‌ చేరడానికి అవకాశముంటుంది.

దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌ బవుమానే  అతి పెద్ద సమస్య. బవుమా కెప్టెన్సీ ప‌రంగా ప‌ర్వాలేదు. అత‌ని ఫామ్ ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. బవుమా కెప్టెన్‌ కాబట్టి సెలక్టర్లు అత‌డిని జ‌ట్టులో కొన‌సాగిస్తున్నారు. భారత్‌తో మూడు టీ20ల్లో వరుసగా 0, 0, 3 పరుగులే చేసిన అతను తొలి వన్డేలో 8కే ఔటయ్యాడు. అయితే అన్ని అడ్డంకులు అధిగ‌మించి, ఈ సారి స‌ఫారీలు ప్ర‌పంచ‌క‌ప్ సాధిస్తార‌లో లేదో చూడాలి. 

దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ జట్టు: బవుమా (కెప్టెన్‌), డికాక్, రీజా హెండ్రిక్స్, రొసో, మార్‌క్రమ్, మిల్లర్, క్లాసెన్, కేశవ్‌ మహరాజ్, షంసి, రబాడ, ఎంగిడి, నోకియా, జాన్సన్, స్టబ్స్, పార్నెల్‌.

 గ్రూప్ ద‌శ ముగిసింది. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక‌, నెద‌ర్ లాండ్స్ జ‌ట్లు అర్హ‌త సాధించాయి. ఇక శ‌నివారం నుంచి సూప‌ర్ 12లో జ‌ట్ల‌న్ని పోటీ ప‌డ‌నున్నాయి. ఈ నెల 23న భార‌త్ పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

 

Exit mobile version