INDvsSA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.బ్యాటింగ్ , బౌలింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భారత్ 1_0 తో ముందంజలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్ల తీయగా..దీపక్ చాహార్ ,హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక 107 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా.. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, నోర్జే తలో వికెట్ తీశారు.