Site icon Newsminute24

సౌభాగ్యగౌరి వ్రత పురాణ గాథ..

చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడోరోజు “సౌభాగ్యగౌరీ వ్రతం” ఆచరిస్తారు. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఈరోజు గౌరీ పేరజరిగే ఒక పర్వమైంది. ఈ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించిన మహిళలకు భోగభాగ్యములు, భర్తస్థితి అభివృద్ధి, సంతానం లేని దంపతులకు సంతానం, పెళ్లికాని స్త్రీలకు వివాహం, అన్యోన్య దాంపత్యం, మోక్షం వంటివి కలుగుతాయనే కథ ప్రాచుర్యంలో ఉంది.

 

Exit mobile version