సౌభాగ్యగౌరి వ్రత పురాణ గాథ..
చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడోరోజు “సౌభాగ్యగౌరీ వ్రతం” ఆచరిస్తారు. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఈరోజు గౌరీ పేరజరిగే ఒక పర్వమైంది. ఈ వ్రతమును…