Telangana: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పోరాటానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు..!!
హైదరాబాద్, జూలై 12: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ ధర్నా చౌక్ వద్ద వారు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ట్విట్టర్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని… ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు…