Site icon Newsminute24

తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!

ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్. దీపక్ హుడా ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాడ్ బౌలర్లలో జోర్డాన్, మొయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనలో అతిధ్య జట్టు 148 పరుగులకే కుప్పకూలింది. ఆజట్టులో మొయిన్‌ అలీ , హ్యారీ బ్రూక్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గగా రాణించలేదు. భారత్ బౌలర్లో పాండ్యా నాలుగు,చహల్‌ , అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండేసి వికెట్లు..భువనేశ్వర్‌ ఓవికెట్ తో ఇంగ్లాడ్ పతనాన్ని శాసించారు. ఆల్ రౌండ్ ఫర్మాఫెన్స్ తో అదరగొట్టిన హార్ధిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.

Exit mobile version