Site icon Newsminute24

టీ 20 ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన భారత్..

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా బోణీ కొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై66 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియాకు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 140 భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో పంత్, హార్దిక్ పాండ్య తమదైన చెలరేగిపోయారు. దీంతో 211 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్​ జట్టుకు నిర్దేశించింది భారత జట్టు.కాగా స్వల్ప లక్ష్య చేదనకు దిగిన అఫ్గానిస్థాన్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 66 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఫ్ఘన్ జట్టులో హజ్రతుల్లా 13, రెహమానుల్లా 19, గుల్బాదిన్ 18, నజీబుల్లా 11, మహ్మమద్ నబీ , కరీమ్​ నామమాత్ర స్కోరే చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 2, షమి, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.

Exit mobile version