Newsminute24

బీసీ లపై సీఎం కేసిఆర్ సవతి ప్రేమ:మేకపోతుల నరేందర్

సీఎం కేసీఆర్ కు బీసీ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ తగదని హెచ్చరించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్. పోలీస్ అర్హత పరీక్షలో కట్ఆఫ్ మార్కులు sc,st విద్యార్థులతో సమానంగా బీసీ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గించకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో trs భారీమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

బీసీ విద్యార్థులు పోలీస్ కొలువులు చేయడం.. సీఎం కేసీఆర్ కి ఇష్టం లేదా అని ప్రశ్నించారు నరేందర్. టిఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీల ఓట్లు వద్దనేల వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీసీవిద్యార్థులకు కట్ఆఫ్ మర్క్స్ ప్రకటించపోతే టీఆర్ఎస్ పతనం తప్పదని నరేందర్ హెచ్చరించారు.

Exit mobile version