Site icon Newsminute24

భాగ్యనగరంలో మత అల్లర్లకు కారణాలేంటి?

కుల,మత, ప్రాంతాలకు అతీతమైన భాగ్యనగరంలో మతచిచ్చు రగల్చిందెవరు? హిందూ దేవుళ్లను అవమానపరిచిన మునవ్వర్ ఫారూఖీ షో కి అనుమతించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన.. వేలాది మందితో తెలంగాణా ప్రభుత్వం భద్రత కల్పించడం వెనక అంతర్యమేమి? ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు  ఆరోపణల్లో నిజమెంత?

ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరబాద్ లో  మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవ్వర్ ఫారూఖీ షో నే మత అల్లర్లకు కారణమన్న చర్చ మేధావి వర్గంలో నడుస్తోంది. వివాదాస్పద వ్యక్తిని మంత్రి ktr ఆహ్వానించడం.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే.. రెండు మతాల మధ్య చిచ్చును రాజేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదే అదనుగా ప్రతి పక్షాలు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టి మరలచేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటూ ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలెట్టాయి.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ ఆరోపణలు రావడం.. బీజేపీ నేతలు ఆమె ఇంటి ముట్టడికి పిలుపు ఇవ్వడం.. వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం.. ఖాకీల తీరును నిరసిస్తూ బిజెపి రథసారథి బండి సంజయ్ ధర్మదీక్ష చేపట్టడం.. దీక్ష భగ్నం సంజయ్ అరెస్టుతో రాజకీయ దుమారం  చెలరేగింది. ఈ క్రమంలోనే ముడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిలిపి వేయాలంటూ ఆర్డర్స్ పాస్ కావడం.. సీఎం కేసిఆర్ ఓటమి భయంతోనే యాత్రను అడ్డుకుంటున్నారని కమలం నేతలు విమర్శలు చేయడం కొత్త చర్చకు తావిచ్చింది.

మునవ్వర్ షో తోనే మత చిచ్చు రాజేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలే మత అల్లర్లకు కారణమంటూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్  చేస్తున్నారు.

 

Exit mobile version