Big alert: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లా వ్యాప్తంగా కేవలం 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ మృతులంతా 19 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతోంది.
ఈ హఠాన్మరణాల వెనుక ఏవైనా ఆరోగ్య కారణాలు ఉన్నాయా? లేక కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధముందా? అన్న సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఒక్క జిల్లాలో ఇలాంటి మరణాలు పునరావృతం కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు, మృతుల మరణాలకు గల అసలు కారణాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బృందం దర్యాప్తు చేసి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే, యువకుల్లో గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని పలువురు ఆరోగ్య నిపుణులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. దీని వెనుక జీవనశైలి, మానసిక ఒత్తిడితోపాటు ఇతర ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలన జరగనుంది.