Newsminute24

దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు.  రాష్ట్రంలో  వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే విధంగా ఉన్నట్లు గౌతమ్ పేర్కొన్నారు.

ఇక  గత 75 ఏళ్ల లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎస్సీ ఎస్టీల  సాధికారతకు ఎన్నో రకాల చట్టాలను పథకాలను తీసుకువచ్చాయన్నారు గౌతమ్. ఈ వర్గాల పురోబివృద్దికి కాంగ్రెస్ దోహదం చేస్తే..జగన్ ప్రభుత్వం వీటిని రద్దు చేసి దళిత ద్రోహి గా మిగులుతారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. దివంగత ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్ లాంటి ఎంతోమంది  అధికారులు, ప్రజా మేధావులు, ప్రజా పాలకులు కలిసి రూపొందించిన పథకాలను కమిషన్ల పథకాలుగా వైకాపా ప్రభుత్వం పేర్కొనడం వారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తున్నదని గౌతమ్ దుయ్యబట్టారు.

 

Exit mobile version