Newsminute24

BRS వైరస్..BJP వ్యాక్సిన్: బండి సంజయ్

BRS’ (భారత రాష్ట్ర సమితి) కార్యాలయం ఓపెనింగ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. BRS పెయింట్ ఆరకముందే… VRS అవుతుందని ఎద్దేవా చేశారు. BRS ఒక వైరస్ అయితే… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్ అన్నారు. దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండని కుండ బద్దలు కొట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర _5 ముగింపు సందర్భంగా..కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు.బిజీ షెడ్యూల్ ఉన్నా.. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… పోలీసులు కూడా మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఇక 17వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రకు.. గంగాధర మండల కేంద్రంలో బిజెపి నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎర కేసుపై సంజయ్ మాట్లాడుతూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఏంటో త్వరలోనే బయటపడుతుందన్నారు. రోహిత్ రెడ్డి చేత ఇంత హడావిడిగా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక బ్లాక్ మెయిలర్.. త్వరలనే అందరి బండారం బయటపడుతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసు”ను, రీ ఓపెన్ చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారో ప్రజలకు అర్థమైందని తేల్చిచెప్పారు. ఈ కేసులో విదేశాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని.. ముఖ్యమంత్రి కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టే కేసు క్లోజ్ చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు సిట్ వేసిన నివేదికలు ఏమయ్యాయని? ఆ నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే..బండి సంజయ్ పాదయాత్రలో ప్రజల నుంచి వినతుల వెల్లువెత్తాయి. కేసీఆర్ ప్రభుత్వం నియమించిన ‘బిస్వాల్ కమిటీ’ ఇచ్చిన నివేదికలోని 1.91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ..యువత వినతి పత్రాలు సమర్పించింది. అటు పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడంలేదని పలువురు గ్రామస్తులు కాషాయ దళపతితో గోడు వెళ్లబోసుకున్నారు.

Exit mobile version