Newsminute24

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో….అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ దీన్ని ఆపరేట్‌ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖతో క‌లిసి ఈ షోను ప్రదర్శించింది. చైనా, ర‌ష్యా, బ్రిటన్ త‌ర్వాత వెయ్యి డ్రోన్‌ల‌తో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్ షో నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవ‌త‌రించింది.
ఇక ఇండియా మ్యాప్‌, మ‌హాత్మా గాంధీ, మేకిన్ ఇండియా సింబ‌ల్‌తో స‌హా ప‌లు రూపాల్లో డ్రోన్‌లు విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయాయి. దాదాపు 10 నిమిషాల పాటు కొన‌సాగిన ఈ డ్రోన్ షో విన్యాసాలు చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

Exit mobile version