Site icon Newsminute24

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ త్వరగా రెండో డోసు తీసుకోవాలని మ్యాట్‌ హన్‌కాక్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొద్ది రోజుల్లో బ్రిటన్‌లోని 30 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.తద్వారా.. కేసుల తీవ్రతను నియంత్రిచటంతోపాటు ఆసుపత్రుల్లో బాధితుల రద్దీని తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.

Exit mobile version