అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ‘కస్టడీ ‘. కృతి శెట్టి కథానాయిక. వెంకట్ ప్రభు దర్శకుడు. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించారు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య ఈ మూవీతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నారు. అటు అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం!
కథ…
సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంటాడు శివ ( నాగ చైతన్య). అతనికి చిన్నప్పటినుంచి రేవతి ( కృతి శెట్టి)అంటే ప్రాణం. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరిస్తారు.ఈ క్రమంలోనే ఓ కారు ప్రమాదంలో రాజు (అరవింద్ స్వామి) సిబిఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్) ను అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకొస్తాడు శివ. అయితే ముఖ్యమంత్రి ద్రాక్షాయని ( ప్రియమణి) రాజును చంపమని పోలీస్ కమిషనర్ నటరాజన్(శరత్ కుమార్) ను ఆదేశిస్తుంది. అసలు ముఖ్యమంత్రి ఎందుకు రాజును చంపాలనుకుంటుంది? శివ రేవతిన ప్రేమ కథ ఏమైంది? శివ_ రాజుకు మధ్య గల సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ఎలా ఉందంటే?
ఓ సాధారణ కానిస్టేబుల్.. పోలీస్ వ్యవస్థతో పోరాడుతూ చేసే అసాధారణ ప్రయాణమే ఈ కథ. శివ_ రేవతి లవ్ ట్రాక్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ .. యాక్షన్ సీన్స్ పరంగా ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కింది.ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినా.. సెకండాఫ్ వచ్చే సరికి సినిమా పూర్తిగా గాడి తప్పింది. హీరో , పోలీసుల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఒకే అనిపించినా.. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. మధ్యలో వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
హీరో నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. హీరోయిన్ కృతిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకుంది. అరవింద్ స్వామి నటన సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ప్రియమణి ,శరత్ కుమార్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక పనితీరు :
దర్శకుడు వెంకట ప్రభు సినిమా అనగానే ప్రేక్షకులు.. సస్పెన్స్, కామెడీ సీన్స్ ఎక్స్పెర్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అది పూర్తిగా గతితప్పిందనే చెప్పాలి. సినిమాలో ఎక్కడా కూడా తనదైన మార్క్ కనిపించదు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
“చివరగా కస్టడీ ఓ పెద్ద మిస్టరీ “
రివ్యూ: 2.5/5
( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)