Newsminute24

మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోరుతూ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు పిటిషన్..

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేది దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  కోనుగోళ్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం దుమారం రేపుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు,అక్రమాలపై మూడు పేజీల వినతిపత్రాన్ని ఎన్నికల ప్రధానాధికారికి,ఎన్నికల కమీషన్ కు ప్రకాష్ రావు పంపండం చర్చనీయాంశంగా మారింది.

కాగా మునుగోడు ఉప ఎన్నిక రద్దుకు సంబంధించి ..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి విస్తృత అధికారం ఉందంటూ లేఖలో ప్రకాష్ రావు ప్రస్తావించారు. ఉప ఎన్నికలో
మద్యం, డబ్బు పంపిణి, అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలు జరిగిన సంఘటనలపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు.భారతదేశ చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మునగోడు ఉప ఎన్నికని అన్నారు.

ఇక మునుగోడులో ప్రధాన పండగలు దసరా, దీపావళి సందర్భంగా ఒక్క అక్టోబర్‌ మాసంలోనే దాదాపు 132 కోట్ల రూపాయల మద్యం ఏరులై పారిందన్నారు గోనె ప్రకాష్‌రావు.ఉప ఎన్నికలో భాగంగా రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ , కేంద్రంలోని బిజెపి అక్రమాలకు, ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రతిఓటర్‌కు రూ.20 వేల రూపాయల డబ్బు, మహిళలకు ఒక గ్రాము బంగారం ఇవ్వడానికి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మందు పంపిణీ కట్టడికి చర్యలు తీసుకుని.. ఉప ఎన్నిక రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందని గోనె ప్రకాష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version