Newsminute24

ఈటెల రాజేందర్ కు అడుగడుగునా జన నీరాజనం!

తెలంగాణ మాజీ మంత్రి బిజెపి నేత ఈటెల రాజేందర్ కు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట రహదారిలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈటలకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. గ్రామగ్రామాన, వాడవాడలా బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆనాడు నేను ఉద్యమంలో చేరా. సొంత నియోజకవర్గంతోపాటు ఇక్కడి ప్రజానీకంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. 2023 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడితో కలసి గ్రామాలను పర్యటిస్తానని’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, స్వామి గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్‌‌లు పాల్గొన్నారు. మరోవైపు స్వస్థలం హుజురాబాద్ చేరుకున్న ఈటల కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Exit mobile version