Samabashiva Rao:
సామ్రాజ్యవాదం అంటే సమాజంపై పెత్తనం చేయడమే, సంస్కృతి, సాంప్రదాయాలను విధ్వంసం చేయడమే. యూరోపియన్ సామ్రాజ్యానికి వెలుపల ఉన్న దేశాలను తమ కైవసం చేసుకొని వలసరాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాయి. కొన్ని రాజ్యాలను కైవసం చేసుకున్నాయి. కానీ చాలా చోట్ల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది యూరోపియన్ సామ్రాజ్యవాదం. ప్రతిఘటించిన వారిలో భారత వీరనారీలు అనేకులు తమ పోరాట పటిమను ప్రదర్శించి వారిని మట్టికరిపించారు. తప్పక తెలుసుకోవలసిన వీరనారుల విజయగాధ..
1. రాణి లక్ష్మిబాయి..
లక్ష్మిబాయి మరాఠ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. లక్ష్మిబాయి యుక్తవయసులో ఉన్నపుడే తన తల్లి మరణించింది. లక్ష్మిబాయి తండ్రి రెండవ పీష్వా బాజీరావ్ వద్ద పనిచేసేవాడు. తన కూతురు లక్ష్మిబాయి వీరోచిత చరిత్రను లిఖిస్తుందని జ్యోతిష్యులు చెప్పడంతో లక్ష్మిబాయిని తన తండ్రి కఠినమైన యుద్దవిద్యలు నేర్పుతాడు. తాను ఝాన్సీకి రాజుగా ఉన్న గంగాధర్ రావును వివాహమాడిన తర్వాత లక్ష్మిబాయి అనే పేరు వాడుకలోకి వస్తుంది కానీ మను అనేది తన తల్లిదండ్రులు పెట్టిన పేరు. పెళ్లైన కొంతకాలానికే తన భర్త మరణించడంతో తనకు కొడుకు లేకుండా పోయింది. దీంతో దామోదర్ రావు అనే ఒక అబ్బాయిని దత్తత తీసుకొని తన వారసునిగా భర్త స్థానంలో రాజుగా పట్టాభిషేకం చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దత్తపుత్రున్ని రాజుగా ఒప్పుకోలేదు. దీంతో తిరుగుబాటు తప్పలేదు. లక్ష్మిబాయి అప్పటికే ఈస్ట్ కంపెనీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఝల్కరీబాయితోపాటు మరికొంతమందితో జతకలిసింది. ఈస్ట్ కంపెనీ దాడుల నుంచి ఎన్నో పోరాటాలు చేసింది.కొన్నిసందర్భాల్లో తప్పించుకుంది. చివరకు 1858లో గ్వాలియర్ లోని ఫూలన్ బాగ్ లో చంపబడింది. లక్ష్మిబాయి చేసిన తిరుగుబాటు పోరాటాల్లో జాతీయవాద పోరాటం ప్రాముఖ్యమైంది. ఇది స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నాందీ పలికింది.
2. రాణి అవంతి బాయి..
రాణి అవంతి బాయికి రాణి లక్ష్మిబాయితో చాలా దగ్గరి పోలికలున్నాయి. అవంతిబాయి లక్ష్మిబాయి సమకాలీనురాలు. వీరిద్దరి జీవితాలు కూడా దాదాపుగా ఒకే పంథాలో సాగాయి. ఇద్దరూ రాజకుటంబాలలో కాకుండా సాధారణ కుటుంబాల్లో జన్మించారు. ఇద్దరు రాజులను పెళ్లి చేసుకోవడం ద్వారా రాజరికంలోకి అడుగుపెట్టారు.ఇద్దరు కూడా దేశాన్ని బ్రిటీష్ కబంద హస్తాల నుంచి తప్పించేందుకు పోరాడుతూ అసవులుబాశారు. అవంతిబాయి భూస్వామ్య వ్యవస్థ బలంగా అమలవుతున్న రోజుల్లో అట్టడుగు కులమైన లోధీ కులంలో పుట్టింది. తన భర్త విక్రమాదిత్య సింగ్ మానసిక వైకల్యంతో ఉన్నాడని, ఆయతోపాటు,ఇద్దరు కుమారులు కూడా రాజ్యపాలన చేయడానికి అనర్హులని ప్రకటించడంతో తన పొరుగు రాజులను ఏకం చేసి తనకు మద్దతుగా మార్చుకొని అవంతిబాయి తిరుగుబాటు చేస్తుంది. అయితే తన చివరి క్షణాల్లో కూడా తనకు సాయం చేసినవారి పేర్లు చెప్పకుండానే తుదిశ్వాస విడిచింది.
3. బేగం హజ్రత్ మహల్..
బేగం హజ్రత్ మహల్ కూడా లక్ష్మిబాయి, అవంతి బాయి కోవలోకి వస్తుంది. ఈమె కూడా రాజ కుటుంబంలో జన్మించలేదు. రాజు వాజిద్ అలీ షా, ఈయన ఔద్ రాజ వంశంలో చివరి రాజు. వాజిద్ అలీ షా అంటే రెండు ప్రధాన విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి కవిత్వం రెండోది బ్రిటీష్ వారి చేత తన సింహాసనాన్ని కోల్పోయాడనేది. అలీ షాకు ఉన్న భార్యలలో హజ్రత్ మహల్ ధైర్యశీలి. బ్రిటీష్ వలసవాదుల సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పోరాడింది. అందుకే ఆమెకు హజ్రత్ మహల్ అనే పేరు వచ్చింది. అయితే ఈమె మహమ్మదీ ఖానుమ్ అనే వేశ్యకు పుట్టింది. తర్వాత రాజ కుటుంబీకులకు అమ్మివేయబడింది. ఈ విధంగా ఆమె రాణి కాగలిగింది.1857లో బ్రిటీష్ వారు లక్నోను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తన మిత్రపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అయితే తర్వాత కాలంలో బ్రిటీష్ వారు తమతో కలిసి రాజ్యపాలన చేయాలని కోరినప్పటికీ దానిని తిరస్కరించి తానే ఔద్ రాజ్యవారసత్వాన్ని కొనసాగించింది. ఆమె తన జీవిత చరమాంకంలోనూ నేపాల్ కేంద్రంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. చివరకు 1879లో తుదిశ్వాస విడిచింది.
4. వేలు నాచియార్..
వేలు నాచియార్. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ వారిపై పోరాటం చేసిన భారతీయ రాణి. తమిళనాడు రామ్నాడ్ రాజుకు ఏకైక కుమార్తె. వేలు నాచియార్. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ వారిపై పోరాటం చేసిన భారతీయ రాణి. తమిళనాడు రామ్నాడ్ రాజుకు ఏకైక కుమార్తె. 1730 లో జన్మించింది. తన సోదరులు లేనప్పుడు రాజ్యం పరిస్థితి ఏంటనే ముందు చూపుతో ఆమె చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలో ఆరితేరింది. అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటీష్ వారు ఇండియాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న కాలo. తర్వాత వారు మహమ్మద్ అలీఖాన్ వాల్లజ్ సాయంతో కొంతవరకు విజయవంతం కాగలిగారు. వేలు నాచియార్ శివగంగాయ్ రాజైన ముత్తువాడుగణతపెరియా ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఈయన బ్రిటీష్, ఫ్రెంచ్ వారికి జరిగిన యుద్ధంలో అసువులు బాశారు. దీంతో వేలు 1772లో తన కుమార్తెతో తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకుంది. చాలా పరిణామాల తర్వాత తిరిగి రాణిగా సింహాసనం అధీష్టించింది. పదేళ్లపాటు రాజ్యపాలన చేసింది. వీరనారీగా బిరుదాంకితురాలైన వేలు నాచియార్ 1790లో మరణించింది.
5. కిత్తూరు చెన్నమ్మ..
1778లో కర్ణాటకలోని బెల్గాంలో చెనమ్మ లింగాయత్ కులంలో జన్మించింది. రాజా మల్లసరాజాను వివాహం చేసుకొని రాణి అయింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటికే రాజ వారసత్వంపై చట్టం రాలేదు. దీంతో ఆమె బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ మౌంట్ స్టువార్ట్ ఎల్ఫిన్సన్‌కు తన దత్తపుత్రుడిని వారసుడి హోదాలో రాజుగా అంగీకరించాలంటూ లేఖ రాసింది. దాన్ని బ్రిటీష్ వారు తిరస్కరించారు. 1824లో తిరుగబాటు చేసి, యుద్ధంలో గెలిచింది. అంతమాత్రమే కాకుండా పట్టుబడిన ఇద్దరు బ్రిటీష్ అధికారులను జైలులో పెట్టించింది. దీంతో బ్రిటీష్ వారు ఈమె రాజ్యంపై దాడులు ముమ్మరం చేశారు. చివరకు బ్రిటీష్ వారికి చిక్కడంతో వారు ఆమెను బంధించారు. బంధకాల్లో ఉన్నపుడే 1824లోనే ఆమె తుది శ్వాస విడిచింది.
6. అబ్బక్క చౌతా..
పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారతదేశ తీరప్రాంతాల్లో వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నకాలం. తదనంతరం వారు ప్రణాళికబద్ధంగా వలసవాదాన్ని నెమ్మదిగా బలపరచుకుంటూ దేశాన్ని వారి ఆక్రమణలోకి తీసుకున్నారు. పశ్చిమ భారత తీరంలో జరిగే వాణిజ్యంపై పోర్చుగీసువారు అధిక పన్ను విధించారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగుళూరు ఓడరేవు నుంచి ఆక్రమణ చేసుకోవాలని భావించారు. దీంతో అబ్బాక్కా చౌతాను ఎదుర్కొన్నారు. ఆమె అలియాసంతన అనే కులంలో పుట్టింది. ఆమె వారసత్వంగా రాజరికం వచ్చింది. తర్వాత బంగా రాజైన లక్ష్మప్ప అరాసను పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. తనకు వారసత్వంగా వచ్చిన ఉల్లాల్ ను కూడా పరిపాలించింది. పోర్చుగీసు వారు ఎన్ని రాయబారాలు పంపిన వారితో ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు ఆమెపై, రాజ్యం దాడి చేసేందుకు ప్రయత్నించిన పోర్చుగీసు వారు విఫలమయ్యేవారు. అయితే 1750లో భారీ సైన్యంతో ఆమె రాజ్యంపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న అబ్బక్క పోరాటానికి ఎదురువెళ్లి పోర్చుగీసు వారిని ఎదుర్కొంది. కానీ భారీ సైన్యం ఉండటంతో చివరకు వారికి చిక్కింది. బంధీఖానాలో ఉండి కూడా ఆమె పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడింది. ఆమె మరణాంతరం ఆమె కుమార్తెలు పోర్చుగీసు వారిపై పోరాటాన్ని కొనసాగించారు.