ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న పంజాబ్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు. జట్టు కెప్టెన్స్ మార్చిన ఫలితం మాత్రం మారలేదు. జట్టులో స్టార్ ఆటగాళ్లకు ఏమాత్రం కొదవలేదు. కోట్లు కుమ్మరించి కొన్న ఆటగాళ్లు ఆశించిన మేర రాణించికపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికైనా పేరు మారిస్తేనన్నా జట్టు ఫేట్ మారుతుందో చూడాలి.
ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!
