Site icon Newsminute24

పంజాబ్ పై నైట్ రైడర్స్ విజయం!

వరుస పరాజయల్తో సతమతమవుతున్న నైట్ రైడర్స్ పంజాబ్ పై విజయం ఊరటనిచ్చింది. సోమవారం పంజాబ్ తో పోరులో అజట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానం నిలుపుకుంది. తొలుత  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6)  జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో, ప్రసిద్ధ్‌ 3, నరైన్‌, కమిన్స్‌ 2 వికెట్లు తీయగా శివమ్‌ మావి, చక్రవర్తి చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 16.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ త్రిపాఠి(41; 32 బంతుల్లో 7×4), ఇయాన్‌ మోర్గాన్‌(47 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో కోల్‌కతా విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌, షమి, అర్ష్‌దీప్‌, దీపక్‌ హుడా తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

 

Exit mobile version