Site icon Newsminute24

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor)

============================

సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే

……………………….

నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్. నెహ్రూ-ఇందిర పరివారానికి ఏకకాలంలో హనుమంతప్ప, కట్టప్పగా పనిచేయడానికి సిద్ధమవుతున్న మన కలుబురిగి ఖర్గే సాహబ్ 82 సంవత్సరాల వయసులో ముందుకు సాగాలి.

ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే అని సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీజీలు ప్రకటిస్తే కట్టప్ప తప్పక దిల్లీ పీఠం ఎక్కుతారు. ఇది జరగాలని కోరుకునేవారి సంఖ్య బాగానే ఉంది. ఇద్దరు దళిత దిగ్గజాలు (కేఆర్ నారాయణన్, ఆరెన్ కోవింద్) అధికారాలు లేని రాష్ట్రపతి పదవిని అందుకున్నారు. ‘అభినవ కట్టప్ప’ అయినా ప్రధానమంత్రి ఐతే బాగుండు. శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో ఖర్గే గారు గుజరాతీ ఓబీసీ ప్రధాని నరేంద్రభాయ్ మోదీ ఖాళీ చేసి కురిసీ 2029 ఎన్నికల తర్వాత అయినా ఎక్కుతారని ఆశిద్దాం.
……………………….

Exit mobile version