రీలిజ్ కి ముందే గాడ్ ఫాదర్ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైనట్రైలర్,టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. మరోవైపు చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి..సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన డైలాగ్ తీవ్ర చర్చకు
దారితీసింది.
లక్ష్మీభూాపాల్ కి మంచి భవిష్యత్ ఉంది :
కాగా మెగాస్టార్ డైలాగ్ చూసినట్లయితే..’ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము తిన్నారు ఒక్కొక్కరూ. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా. ఇందులో ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం. తప్పుచెయ్యాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే.. మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది ‘ ..ఇంతంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన లక్ష్మీభూపాల్‌కు నా అభినందనలు.. మంచి ప్రతిభ ఉన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్ కి నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని
నమ్ముతున్నాను#GodFather #GodFatherOnOct5th pic.twitter.com/F6D0jMx1F6— Chiranjeevi Konidela (@KChiruTweets) September 29, 2022
రికార్డులు బద్దలు అవడం ఖాయం:
ఇప్పడు మెగాస్టార్ పోస్ట్ చేసిన డైలాగ్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేవిధంగా డైలాగ్ సరిగ్గా సరిపోయిందంటూ జనసైనికులు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.ఇక మెగా అభిమానుల అయితే గాల్లో తేలిపోతున్నారు. మెగా బాస్ మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ పోస్టులతో రెచ్చిపోతున్నారు.
ఇక దసరా పండగ సందర్భంగా గాడ్ ఫాదర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలు పోషించిన..ఈమూవీకి మళయాళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. సంగీతం తమన్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్, ఎన్ వి ప్రసాద్, ఆర్ బి చౌదరి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.