Site icon Newsminute24

ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా : మంత్రి జగదీష్

సూర్యాపేట: తెలంగాణా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ క్యాలెండర్ ను ఆయన శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో దోహదపడుతుందన్నారు జ‌గ‌దీష్ రెడ్డి.సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ఫార్మర్స్ ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తో విద్యుత్ శాఖా జిల్లాల వారిగా స్టోర్స్ ప్రారంభించడంతో మారు మూల ప్రాంతాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లతో పాటు ఇతర పరికరాలు సరఫరా సులభ తరమైందని మంత్రి పేర్కొన్నారు.యావత్ భారత దేశంలో వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా యేని.. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధియే తార్కాణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

Exit mobile version