Site icon Newsminute24

నాగ శ్రీనుకు మెగా బ్రదర్ ఆర్థిక సాయం!

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను కుటుంబ పరిస్థితిని తెలుసుకొని రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాక అతని పిల్లలకు వైద్య పరీక్షలు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అటు నాగబాబు సాయాన్ని మంచు ఫ్యామిలీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రతి నెల నాగ శ్రీనుకు కరెక్ట్‌గానే శాలరీ డిపాజిట్ చేయడం జరిగిందని.. గత నెల కూడా శాలరీ డిపాజిట్ చేశాము’’ అని మంచు ఫ్యామిలి తరపు పిఆర్ వెల్లడించడం ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశం అయింది.

Exit mobile version