Site icon Newsminute24

పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలి: ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పదోన్నతి పొందిన CI, ARSI లు జిల్లా పోలీస్ కార్యాలయంలో Sp అపూర్వ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన  CI లకు,ARSI లకు యస్.పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  యస్.పి మాట్లాడుతూ.. పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి  ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలని హితువు పలికారు.  పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా పని చేయాలని.. అప్పుడే ప్రజల్లో  పోలీస్ శాఖపై నమ్మకం కలుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఆర్ అడిషనల్ ఎస్పీ హానుమంతరావు, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్,శ్రీను,సంతోష్,హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version